|
|
హిమాలయాలు
హిమాలయాలు లేదా హిమాలయా పర్వతాలు (ఆంగ్లం : Himalaya Range) (సంస్కృతం : हिमालय,), లేదా ఆసియా లోని హిమాలయ పర్వతా పంక్తులు. ఈ పర్వత పంక్తులు భారత ఉపఖండాన్ని టిబెట్ పీఠభూమి ని వేరుచేస్తున్నాయి. ఈ పర్వత పంక్తులలో కారాకోరం, హిందూకుష్, తోబా కాకర్ మరియు చిన్న పర్వతశ్రేణులైన పామిర్ కోట్ వరకూ వ్యాపించి వున్నాయి. హిమాలయాలు అనగా సంస్కృతంలో "తత్పురుష" లేదా మంచుకు నెలవు.[1]
ఈ పర్వత పంక్తులు, ప్రపంచంలోనే ఎత్తైనవి. వీటిలో ఎవరెస్టు పర్వతం, కాంచనగంగ మొదలగు శిఖరములున్నవి. సుమారు నూరు శిఖరములు 7,200 మీటర్ల ఎత్తుకు మించివున్నవి.[2]
ఈ హిమాలయాలు, ఆసియా లోని ఐదు దేశాలలో వ్యాపించి వున్నవి : భూటాన్, చైనా, భారతదేశం, నేపాల్ మరియు పాకిస్తాన్. ఇవి ప్రపంచంలోని అతి పెద్దనదులలో మూడు అయిన సింధు, గంగ-బ్రహ్మపుత్ర మరియు యాంగ్ట్జీ నదులకు వనరులు. వీటి పరివాహక ప్రాంతాలలో 1.3 బిలియన్ల జనాభా వున్నది. ఇవి చంద్రవంక ఆకారంలో 2,400 కి.మీ.ల పొడవూ మరియు 400 కి.మీ. వెడల్పు ప్రాంతంలో వ్యాపించి వున్నాయి.
హిమాలయాల 6,000 కి.మీ.ల యాత్ర, భారతఫలకం తాకక ముందు.
[మార్చు] హిమాలయాలలో కొన్ని ముఖ్యమైన శిఖరాలు
| శిఖరం పేరు |
ఇతర పేర్లు మరియు అర్థం |
ఎత్తు (మీటర్లు) |
ఎత్తు (అడుగులు) |
మొదటి అధిరోహణ |
నోట్స్ |
| ఎవరెస్టు శిఖరం |
సాగర్ మాతా, "ఆకాశ నుదురు",
చోమోలాంగ్మా, "విశ్వమాత" |
8,848 |
29,029 |
1953 |
ప్రపంచంలోని ఎత్తైన పర్వతం, నేపాల్/టిబెట్ సరిహద్దులో గలదు. |
| కే-2 |
చోగో గాంగ్రి |
8,611 |
28,251 |
1954 |
ప్రపంచంలోని 2వ ఎత్తైన పర్వతం, ఆజాద్ కాశ్మీరు, పాకిస్తాన్ మరియు చైనాలోని జింజియాంగ్ లో గలదు. |
| కాంచనగంగ |
కాంగ్‌చెన్ డ్‌జోంగా, "మంచు యొక్క ఐదు ఖజానాలు" |
8,586 |
28,169 |
1955 |
ప్రపంచములోని 3వ ఎత్తైన శిఖరం. సిక్కిం (భారత్) మరియు నేపాల్ లో గలదు. |
| లోట్సే |
"దక్షిణ శిఖరం" |
8,516 |
27,940 |
1956 |
ప్రపంచంలోని 4వ ఎత్తైన శిఖరం. నేపాల్ మరియు టిబెట్ ల మధ్యలో గలదు, ఎవరెస్టు ఛాయలో గలదు. |
| మకాలూ |
"మహా నల్లనిది (The Great Black)" |
8,462 |
27,765 |
1955 |
ప్రపంచలోని 5వ ఎత్తైన శిఖరం. నేపాల్ లో గలదు. |
| చో ఓయు |
ఖోవోవుయాగ్, "నీలి (టర్కోయిస్ ఊదా రంగు) దేవత" |
8,201 |
26,905 |
1954 |
ప్రపంచలోని 6వ ఎత్తైన శిఖరం. నేపాల్ లో గలదు. |
| ధవళగిరి |
"తెల్లని పర్వతం" |
8,167 |
26,764 |
1960 |
ప్రపంచలోని 7వ ఎత్తైన శిఖరం. నేపాల్ లో గలదు. |
| మానస్లూ |
కుటాంగ్, "ఆత్మ పర్వతం" |
8,156 |
26,758 |
1956 |
ప్రపంచలోని 8వ ఎత్తైన శిఖరం. గూర్ఖా హిమాల్, నేపాల్ లో గలదు. |
| నంగా పర్వతం |
దయామీర్, "నగ్న పర్వతం" |
8,126 |
26,660 |
1953 |
ప్రపంచలోని 9వ ఎత్తైన శిఖరం. భారత్/పాకిస్తాన్ లో గలదు. |
| అన్నపూర్ణ |
"పంటల దేవత" |
8,091 |
26,545 |
1950 |
ప్రపంచలోని 10వ ఎత్తైన శిఖరం. మృత్యుకర పర్వతం. నేపాల్ లో గలదు. |
| గాషెర్‌బ్రమ్ I |
"అందమైన పర్వతం" |
8,080 |
26,509 |
1958 |
ప్రపంచలోని 11వ ఎత్తైన శిఖరం. కారాకోరం పాకిస్తాన్/చైనా లో గలదు. |
| విశాల శిఖరం |
ఫైచాన్ కాంగ్రి |
8,047 |
26,401 |
1957 |
ప్రపంచలోని 12వ ఎత్తైన శిఖరం. కారాకోరం పాకిస్తాన్/చైనా లో గలదు. |
| గాషెర్‌బ్రమ్ II |
- |
8,035 |
26,362 |
1956 |
ప్రపంచలోని 13వ ఎత్తైన శిఖరం. కారాకోరం పాకిస్తాన్/చైనా లో గలదు. |
| షిషాపాంగ్మా |
జిజియాబాంగ్మా, "గడ్డిమైదానాలపై ఎత్తుప్రాంతం" |
8,013 |
26,289 |
1964 |
ప్రపంచలోని 14వ ఎత్తైన శిఖరం. టిబెట్ లో గలదు. |
| గాషెర్‌బ్రమ్ IV |
- |
7,925 |
26,001 |
1958 |
ప్రపంచలోని 17వ ఎత్తైన శిఖరం. అత్యంత సాంకేతిక అధిరోహణ. కారాకోరమ్ పాకిస్తాన్/చైనా లో గలదు. |
| మాషెర్బ్రమ్ |
-తెలీదు- |
7,821 |
25,660 |
1960 |
ప్రపంచలోని 22వ ఎత్తైన శిఖరం. కారాకోరం పాకిస్తాన్/చైనా లో గలదు. |
| నందా దేవి |
"ఆశీర్వదించు-దేవత" |
7,817 |
25,645 |
1936 |
ప్రపంచలోని 23వ ఎత్తైన శిఖరం. భారత్ లోని ఉత్తరాఖండ్ లో గలదు. |
| రాకాపోషి |
"మెరిసే కుడ్యము" |
7,788 |
25,551 |
1958 |
శిఖరాల సముదాయము. కారాకోరం పాకిస్తాన్/చైనా లో గలదు. |
| గాంగ్ఖర్ పుయెన్సుమ్ |
గాంకర్ పుంజుమ్, "మూడు సోదర పర్వతాలు" |
7,570 |
24,836 |
అధిరోహించలేదు |
ప్రపంచంలో అధిరోహించని ఎత్తైన శిఖరం. భూటాన్ లో గలదు. |
| అమా దబ్లామ్ |
"తల్లి మరియు ఆమె నెక్లేస్" |
6,848 |
22,467 |
1961 |
ప్రపంచంలోనే చాలా అందమైన శిఖరం. నేపాల్ లోని ఖుంబూ లో గలదు. |
[మార్చు] ధార్మిక స్థానాలు
హిమాలయాలలో హిందూ మరియు బౌద్ధ ధర్మాలకు చెందిన అనేక ధార్మిక ప్రదేశాలు గలవు. హిందూ ధర్మంలో హిమవత్ శివుని భార్యయైన పార్వతి యొక్క తండ్రి.
- హరిద్వార్, గంగానది, మైదానంలో ప్రవేశించే ప్రాంతం.
- బద్రీనాథ్, వైష్ణవాలయం.
- కేదార్నాథ్, 12 జ్యోతిర్లింగాలు గల ప్రదేశం.
- గౌముఖ్, భగీరథి జన్మస్థానం.
- దేవ్‌ప్రయాగ్, ఇచట అలక్‌నంద మరియు భగీరథి నదులు కలసి గంగా నది గా ఏర్పడుచున్నవి.
- రిషీకేష్, లో లక్ష్మణ దేవాలయం వున్నది.
- కైలాశ పర్వతం, 6,638 మీటర్ల ఎత్తులో గల శిఖరం, ఇది శివపార్వతుల నివాస స్థలి. ఈ పర్వత అడుగుభాగానే మానస సరోవరం వున్నది, ఇది బ్రహ్మపుత్ర జన్మస్థానం.
- అమరనాథ్, ఇక్కడ శివలింగం వున్నది.
- వైష్ణోదేవి, ఈ దేవాలయం, దుర్గాదేవి భక్తులకు కేంద్రబిందువు.
- హిమాలయాలలో టిబెట్ కు చెందిన ఎన్నో ధార్మిక ప్రదేశాలు గలవు. దలైలామా నివాస స్థలం కూడా ఈ హిమాలయాలలోనే గలదు.
- యతి అనే ప్రసిద్ధ జీవి, జీవించినట్లు ప్రజల విశ్వాసం.
- షంభాలా బౌద్ధ ధర్మంలో ప్రముఖ నగరం. భౌతికంగా ఈ నగరం లేకపోయినప్పటికీ ఆధ్యాత్మికం గా బౌద్ధులు చేరే నగరం.
- హేమ్‌కుండ్ సాహెబ్ - గురు గోబింద్ సింగ్ తపస్సు చేసిన స్థలంలో గల గురుద్వార.
[మార్చు] ఇవీ చూడండి
The Himalayan Journal published by Himalayan Club
[మార్చు] ఇతర పఠనాలు
[మార్చు] బయటి లింకులు
[మార్చు] చిత్రమాలిక
టిబెట్ లోని రాంగ్-బక్ నుండి ఎవరెస్టు పర్వతం
|
|
|
భారతదేశానికి సంబంధించిన విషయాలు  |
| చరిత్ర |
భారతీయ చరిత్ర కాలసూచిక, సింధు లోయ నాగరికత, మేలుహ్హా, ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం, భారతదేశంలో గ్రీకుల దండయాత్రలు, మౌర్య వంశం, అశోకుడు, శుంగ వంశం, శాతవాహనులు, ఇండో గ్రీకు సామ్రాజ్యం, ఇండో స్కిథియనులు, ఇండో పార్థియన్ సామ్రాజ్యం, కుషాణు సామ్రాజ్యం, పశ్చిమ క్షాత్రపులు, గుప్త సామ్రాజ్యం, పాల సామ్రాజ్యం, భారతదేశంలో ఇస్లాం, భారత్‌లో ఇస్లాం సామ్రాజ్యాలు, మొగలు యుగం, మరాఠా సామ్రాజ్యం, బ్రిటిషు రాజ్, బ్రిటిషు ఈస్ట్ ఇండియా కంపెనీ, భారత గవర్నర్ జనరల్, భారత వైస్రాయి, ప్రథమ భారత స్వాతంత్ర్య సమరం, భారత స్వాతంత్ర్య సమరం, క్విట్ ఇండియా ఉద్యమం, భారత విభజన, అలీనోద్యమం, చైనా భారత యుద్ధం, భారత పాక్ యుద్ధం 1947, భారత పాక్ యుద్ధం 1965, భారత పాక్ యుద్ధం 1971, కార్గిల్ యుద్ధం, భారత సైన్యం, భారత జనాభా వివరాలు, భారతీయ తపాల చరిత్ర |
| రాజకీయాలు |
జాతీయతా సూచికలు, న్యాయ వ్యవస్థ, రాజ్యాంగం, రాజకీయ పార్టీల చరిత్ర (భారతీయ జనతా పార్టీ, భారత జాతీయ కాంగ్రెస్), విదేశీ సంబంధాలు, ఎన్నికలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు |
| ప్రభుత్వం |
భారత ప్రభుత్వ ఏజన్సీలు, శాసన విభాగం (లోక్ సభ, రాజ్య సభ) కార్య నిర్వాహక విభాగం (రాష్ట్రపతి & ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, భారత మంత్రివర్గం, భారత అటార్నీ జనరల్, భారత ఎన్నికల కమిషను, భారత విదేశీ వ్యవహారాల మంత్రి; భారత్‌లో చట్టాల అమలు: సి.బి.ఐ, సి.ఐ.డి, భారత నిఘా సంస్థలు: ఐ.బి, రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్), న్యాయ విభాగం (సుప్రీం కోర్టు), భారత రక్షణ దళాలు (భారత సైనిక దళం, భారత నావికా దళం, భారత వైమానిక దళం, సరిహదు భద్రతా దళం, భారత తీరరక్షక దళం) |
| భౌగోళిక స్వరూపం |
హిమాలయాలు, పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు, గంగా మైదానము, దక్కను పీఠభూమి, థార్ ఎడారి, గంగ, కచ్, బ్రహ్మపుత్ర, ఈశాన్య భారతం; భారత్ పర్వతాల జాబితా, భారత లోయల జాబితా, భారత ద్వీపాల జాబితా, భారత నదుల జాబితా; భారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, భారత నగరాలు, పట్టణాల జాబితా, భారత జిల్లాల జాబితా, భారత ప్రాంతాల జాబితా |
| ఆర్ధికం |
పంచవర్ష ప్రణాళికలు, భారత రూపాయి, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్, భారత్‌లో జీవన ప్రమాణాలు, భారత కంపెనీలు, భారతీయ రిజర్వ్ బాంక్ |
| జనాభా |
భారతదేశ జాతీయ భాషలు, భారత్‌లో జీవన ప్రమాణం, భారత్‌లో మతము |
| భారత కళలు, వినోదం & భారతీయ సంస్కృతి |
భారతీయ సంగీతం (కర్ణాటక సంగీతం, హిందుస్తానీ సంగీతము, ఇండి పాప్), భారతీయ సినిమా & భారత్‌లో టెలివిజన్ (హిందీ సినిమా, తెలుగు సినిమా), భారత టెలివిజన్ స్టేషన్ల జాబితా, భారతీయ సాహిత్యం, భారతీయ వంటలు, భారత్‌లో సెలవులు, జానపద భారతం, భారత శాస్త్రీయ నాట్యం, భారతీయ శిల్పకళా; భారత్‌లో విద్య, భారతీయ భాషలు, భారత్‌లో మాధ్యమాలు |
| ఇతరాలు |
కాశ్మీరు తీవ్రవాదం, భారతీయ ఇంగ్లీషు, భారత జాతీయతా చట్టం, రెండు దేశాల పౌరసత్వం, భారతీయ సంఖ్యా మానము, ఇస్రో, భారత సమాచార వ్యవస్థ, భారత రవాణా వ్యవస్థ (భారత హైవేలు, రైల్వేలు, ఆటో రిక్షా), భారత జాతీయ పతాకం, భారత పర్యాటక రంగం, భారత వార్తా వనరులు, భారత వాహన లైసెన్సులు |
|