పరికరాల పెట్టె |
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
అక్షాంశరేఖాంశాలు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, భారతదేశం లోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణతీరప్రాంతపు జిల్లా. ఈ జిల్లా ముఖ్య పట్టణం నెల్లూరు. ఈ జిల్లా వరి సాగుకు, ఆక్వా కల్చర్ కు ప్రసిద్ధి. ఇంతకు ముందు "నెల్లూరు జిల్లా" అనబడే ఈ జిల్లా పేరును పొట్టి శ్రీరాములు గౌరవార్ధం "శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా"గా జూన్ 1, 2008 నుండి [1] మార్చారు. [మార్చు] నెల్లూరు పేరుమనుమసిద్ధి కాలంలో ఈ ప్రాంతం సస్యశ్యామలమై అత్యధిక వరి ధాన్యపు ఉత్పత్తితో విలసిల్లేది. అందుకే ఈ ప్రాంతానికి నెల్లి ( తమిళ భాషలో వరి అని అర్ధం) పేరుమీదుగా నెల్లివూరు అనే పేరు వచ్చింది. ఈ ప్రదేశ స్థలపురాణం, చరిత్రల ప్రకారం కాలక్రమంలో నెల్లివూరు నెల్లూరుగా రూపాంతరం చెందింది. ఆంగ్లేయుల పరిపాలనా కాలంలో నెల్లూరు, ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ విద్యా కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. నెల్లూరు సింహపురమని, విక్రమసింహపురమని కూడా వ్యవహరింపమడేది. ఈ పట్టణ సమీపంలోని అడవులలో సింహలపరిమితంగా ఉన్నందువలననే యీ పేరు వచ్చిన్దని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు. విక్రమసింహుడనే వాని ఆధీనంలో యీ ప్రాంతం వున్నదని, అందువలననే అతని పేరు తోనే ఈ ప్రాంతం అలా పిలువమదివుందవచ్చునని యింకొందరు భావిస్తున్నారు.
[మార్చు] జన విస్తరణ, గణాంకాలు[మార్చు] భౌగోళికం[మార్చు] చరిత్ర
నెల్లూరుకు విక్రమసింహపురి అనే పేరు కూడా ఉంది. విక్రమసింహ మహావీర, మనుమసిద్ధి మహారాజు సింహపురి రాజధానిగా నెల్లూరు ప్రాంతాన్ని పరిపాలించాడు. మహాభారతాన్ని తెనిగించిన కవిత్రయంలో ఒకడైన,కవి బ్రహ్మ,ఉభయ కవిమిత్రుడు కవి తిక్కన, ఇతని వద్దే ప్రధాన మంత్రిగా పనిచేశాడు. ఖడ్గ తిక్కన ఇతని రక్షణామాత్యుడు. ఈ ప్రాంతంలో క్వార్త్జైట్ అనే ఒక ప్రత్యేక తరహా ఫ్లింటు రాళ్లు విరివిగా లభిస్తాయి. వీటితో ఆదిమానవులు తమ ఆయుధాలు, పనిముట్లు తయారు చేసే వారు. మగధ సామ్రాజ్య స్థాపన తరువాత ఈ ప్రాంతం మీద కూడా మగధ ప్రభావం ఉండినట్లు తెలుస్తున్నది. క్రీ.శ.3వ శతాబ్దములో నెల్లూరు అశోకుని సామ్రాజ్యంలో భాగమైంది. ఆ తరువాత 4వ శతాబ్దం నుండి 6వ శతాబ్దం వరకు జిల్లా పల్లవుల పాలనలో ఉన్నది. 7వ శతాబ్దం ప్రారంభంలో ఉత్తరాన పల్లవుల ప్రాభవం తగ్గి, అధికారం క్షీణించి, దక్షిణానికి పరిమితమైపోయారు. ఆంగ్లేయుల పరిపాలనలో జిల్లా శాంతియుతంగా ఉన్నది. ఈ కాలంలో రాజకీయ ప్రాముఖ్యత కలిగిన ఒకే ఒక సంఘటన 1838 లో బ్రిటీషు పాలకులకు వ్యతిరేకంగా కర్నూలు నవాబు పన్నిన తిరుగుబాటు కుట్రలో పాలుపంచుకొన్నందుకు ఉదయగిరి జాగిర్దారు నుండి ఉదయగిరి జాగీరును లాగివేసుకోవటం. జిల్లా నేరుగా బ్రిటిషువారి పాలనలో వచ్చిన తర్వాత, 1904 లో ఒంగోలు తాలుకాను అప్పుడే కొత్తగా ఏర్పడిన గుంటూరు జిల్లాకు బదిలీ చేయటం తప్ప జిల్లాలో పెద్ద మార్పులేమీ జరగలేదు.
[మార్చు] వ్యవసాయం, ఆక్వా కల్చర్, నీటి వనరులునెల్లూరు జిల్లా వరి సాగుకు చాలా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతాన్ని భారతదేశ ధాన్యాగారం అని అంటారు. బంగాళా ఖాతపు తీరం వెంట చేపల, రొయ్యల పెంపకానికి (ఆక్వా కల్చర్) నెల్లూరు చాలా ప్రసిద్ధి.
[మార్చు] ఖనిజాలుఅభ్రకం ఉత్పత్తి లో అగ్రగామి. పింగాణి, ముడి ఇనుము, జిప్సం, సున్నాపురాయి నిధులున్నాయి. [మార్చు] విద్యాలయాలువెంకటగిరి రాజా కళాశాల [మార్చు] పరిశ్రమలుజిల్లాలో ట్రేడింగ్ రైసు మిల్లులు, నాన్ ట్రేడింగ్ రైసు మిల్లులు, షుగర్ మిల్లులు ఉన్నాయి. విఖ్యాతిగాంచిన రాకెట్ ప్రయోగ కేంద్రం "సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రము" (షార్) నెల్లూరు జిల్లా లోని శ్రీహరికోట లో ఉంది. [మార్చు] విద్య, వైద్య సౌకర్యాలు[మార్చు] రవాణా సౌకర్యాలువిజయవాడ, చెన్నై నగరాల మధ్యన నెల్లూరు ఉండటం వల్ల వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందుతున్నది.
నెల్లూరు నగరం చెన్నై-కోల్ కతా జాతీయ రహదారి (NH-5) మీద చెన్నై-ఒంగోలు ల మధ్య ఉన్నది. ప్రస్తుతం ఈ రహదారి నాలుగు మార్గాలతో ఉన్నది. 2011 కల్లా ఇది ఆరు మార్గాలుగా విస్తరింపబడుతుంది. తిరుపతి, విజయవాడ, చెన్నై, హైదరాబాదు, కర్నూలు, కడప, అనంతపురం, ఒంగోలు, విశాఖపట్టణం, బెంగళూరు .. మొదలగు ప్రదేశములకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు విరివిగా కలవు.
నెల్లూరు నగరం గూడూరు-విజయవాడ రైలు మార్గములో ప్రధాన స్టేషను. ఇక్కడ నుండి తిరుపతి, విజయవాడ, చెన్నై, హైదరాబాదు, విశాఖపట్టణం, బెంగళూరు, న్యూఢిల్లి, హౌరా, తిరువనంతపురం, కన్యాకుమారి .. మొదలగు ప్రదేశములకు నిత్యం రైళ్ళ రాకపోకలు కలవు. [మార్చు] పర్యాటక స్థలాలుజిల్లాలో పెన్నా నది ఒడ్డున ఉన్న రంగనాధ స్వామివారి ఆలయం, దగ్గరలోనే గొలగమూడిలో ఉన్న వెంకయ్యస్వామి మందిరం,ఉదయగిరి కోట, నరసింహ కొండ, పెంచల కోన, వెంకటగిరి రాజుల కోట , మైపాడు బీచ్, శ్రీహరికోట వద్ద ఉన్న విఖ్యాతిగాంచిన రాకెట్ ప్రయోగ కేంద్రం,శ్రీ కామాక్షితాయి ఆలయం జొన్నవాడ, కృష్ణపట్నం రేవు, నేలపట్టు మొదలైన అనేక చూడదగిన ప్రదేశాలు ఉన్నాయి.
[మార్చు] అవీ, ఇవీనెల్లూరులో తెలుగు సినిమాలకు విపరీతమైన అభిమాన వర్గం ఉంది. పట్టణంలో చాలా సినిమా థియేటర్లు ఉన్నాయి. [మార్చు] పాలనా విభాగాలు
జిల్లాను 46 రెవిన్యూ మండలములుగా విభజించారు.[2]
[మార్చు] జిల్లాకు చెందిన ప్రముఖులుజిల్లాకు చెందిన బెజవాడ గోపాలరెడ్డి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గాను, ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర గవర్నరు గాను పని చేశాడు. గుంటూరు శేషేంద్ర శర్మ - ప్రముఖ సుప్రసిద్ధ కవి ఈ జిల్లాకు చెందిన వాడే. భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షుడు ముప్పవరపు వెంకయ్యనాయుడు, ఆంధ్ర ప్రదేశ్ పూర్వపు ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధనరెడ్డి నెల్లూరు జిల్లాకు చెందినవాడే. ప్రముఖ తెలుగు సినిమా నటుడు చిరంజీవి ఇక్కడే చదివాడు. ప్రముఖ తెలుగు సినిమా కవి ఆచార్య ఆత్రేయ ఈ జిల్లాకు చెందినవాడే.
[మార్చు] పండుగలు /తిరునాళ్ళునెల్లూరులో జరుపుకొనే ముఖ్యమైన పండుగలు:
[మార్చు] మూలాలు
[మార్చు] బయటి లింకులు
|
|||||||||||||||||||||||||||||||||