పరికరాల పెట్టెఇతర భాషలు |
వికీపీడియా:బయటి లింకులువికీపీడియా వ్యాసాల్లో వికీపీడియా నుండి బయటి పేజీలకు తీసుకుపోయే లింకులు పెట్టవచ్చు. సదరు పేజీలు వ్యాస విషయానికి సంబంధించినవి గాను, ఆ విషయంపై ఖచ్చితమైన సమాచారం అందించేవి గాను ఉండాలి; కాపీహక్కుల కారణంగా వ్యాసం పేజీలో పెట్టలేని విషయాన్ని కలిగి ఉండాలి (క్రీడా గణాంకాలు, ఆన్ లైను టెక్స్టు పుస్తకాలు మొదలైనవి); లేదా ఇతర అర్థవంతమైన, సంబంధిత విషయాన్ని కలిగి ఉండాలి. బయటి లింకులు కొన్ని పెట్టడం మంచిదే. కానీ ప్రతీ విషయానికీ చెందిన బయటి లింకుల జాబితా ఒకదాన్ని పెద్దయెత్తున తయారుచేసి పెట్టాలన్నది వికీపీడియా ఉద్దేశ్యం కాదు. వికీపీడియా వ్యాసానికి సంబంధించని పేజీ దేనికీ లింకు ఇవ్వరాదు. వికీపీడియా అనుసరించవద్దు విధానాన్ని అనుసరిస్తుంది కాబట్టి ఇక్కడి నుండి బయటి పేజీలకు ఇచ్చే లింకుల వలన ఆయా పేజీల సెర్చి ఇంజను ర్యాంకుల్లో మార్పులేమీ జరగవు. మీరు లింకు ఇవ్వదలచిన పేజీ లోని సమాచారం ఇంకా మీ వ్యాసంలో చోటు చేసుకోకపోతే, ప్రస్తుతానికి ఆ లింకును మీ మూలం/వనరుగా ఉదహరించండి.
[మార్చు] గుర్తుంచుకోదగ్గ ముఖ్యాంశాలు
[మార్చు] లింకులు ఇవ్వడంలో కట్టుబాట్లువిధాన, సాంకేతిక కారణాల వలన కింది వాటికి లింకులు ఇవ్వడం నిరోధించబడింది.
[మార్చు] దేనికి లింకు ఇవ్వవచ్చుబయటి లింకు ఇచ్చేముందు, అనేక విషయాలను పరిగణించాలి.
బయటి లింకును చేర్చే ముందు ఒక ప్రశ్న వేసుకోండి: దీన్ని వ్యాసానికి మూలం/వనరుగా ఎందుకు వాడలేదు? "ఆధారపడదగ్గ వనరుగా దీన్ని వాడలేము" అనేది మీ సమాధానమైతే, లింకు ఇవ్వకండి. "అది మంచి వనరు" అనేది మీ సమాధానమైతే, లింకు ఇవ్వండి. "ఆ లింకులోని కంటెంటు మరీ విస్తృతంగా ఉంది, దాని సారాంశాన్ని గ్రహించి రాయడం అంత తేలికైన పని కాదు. కానీ అది ఆధారపడదగ్గ వనరు" అనేది మీ సమాధానమైతే కూడా లింకు ఇవ్వవచ్చు. ఫలానా లింకు ఇవ్వవచ్చో లేదో చర్చాపేజీలో చర్చిస్తే మరీ మంచిది. [మార్చు] ఏ విషయాలకు లింకు ఇవ్వాలి
[మార్చు] ఇవ్వదగ్గ మరికొన్ని లింకులు
[మార్చు] ఇవ్వకూడని లింకులు
[మార్చు] వ్యాపార ప్రకటనలు, దృక్పథాల ఘర్షణవికీపీడియాకి ఉన్న ఆదరణను గమనించి దాన్ని సొమ్ము చేసుకుందామనే ఆలోచనతో ఇక్కడ దొడ్డిదారిన వ్యాపార ప్రకటనలు పెట్టుకుందామనే ఆలోచనలు చేసే అవకాశం ఉంది. మీది, మీరు మెయింటైను చేసేది, మీరు ప్రాతినిధ్యం వహించేది అయిన సైటుకు మీరు లింకు ఇవ్వకండి. వికీపీడియా మార్గదర్శకాల ప్రకారం ఆ సైటుకు లింకు ఇవ్వాల్సినంత అవసరం ఉన్నా సరే! ఆ లింకు అంత అవసరమైనదైతే ఆ విషయాన్ని వ్యాసపు చర్చాపేజీలో పెట్టి, తటస్థ సభ్యులను దాని సంగతిని తేల్చనివ్వండి. బాటు ద్వారా వ్యాసాల్లో బయటి లింకులను చొప్పించే స్పాము పద్ధతులు ఉన్నాయి. అలాంటి బాటు చర్యలను మీరు గమనిస్తే, ఇతర వికీల్లో కూడా అది జరుగుతుందేమో గమనించండి. అలా అయితే మెటా-వికీ లోని నిర్వాహకుణ్ణి సంప్రదించండి; వాళ్ళు వికీ వ్యాప్త హెచ్చరికలను విడుదల చేస్తారు. నిర్వాహకులు అలాంటి బాట్లను నిషేధిస్తారు. [మార్చు] రిజిస్ట్రేషను అవసరమైన సైట్లురిజిస్ట్రేషను అవసరమైన సైట్లు, డబ్బు కట్టి మాత్రమే ఉపయోగించుకోగలిగే సైట్లు ఎక్కువ మంది పాఠకులకు ఉపయోగపడవు. అలాంటి వాటికి లింకులు ఇవ్వకండి. వ్యాసం సదరు వెబ్ సైటు గురించే అయితే తప్ప రిజిస్ట్రేషను లేదా చందా అవసరమయ్యే సైటుకు లింకు ఇవ్వకండి. [మార్చు] ఇతర భాషా లింకులుతెలుగు భాషా సైట్లకు లింకు ఇవ్వడం అభిలషణీయం. అయితే తెలుగులో తగినంత సమాచారం లభ్యం కానందు వలన ఇతర భాషా సైట్లకు లింకులు ఇవ్వక తప్పదు. అయితే ఆ లింకులు ఇంగ్లీషు భాషకు మాత్రమే పరిమితం చెయ్యాలి. తప్పనిసరి అయితే - అధికారిక సైటు ఇంగ్లీషులో లేకపోతేనో, మ్యాపులు, బొమ్మలు, పట్టికలు మొదలైనవి ఉంటేనో - తప్ప ఇతర భాషా సైట్లకు లింకులు ఇవ్వకూడదు. సదరు లింకు పక్కనే ఆ భాషకు చెందిన రెండక్షరాల భాషా కోడును గానీ, లేదా ఆ భాష పేరును గానీ రాయండి. [మార్చు] దారిమార్పు సైట్లుదారిమార్పు URLలు కలిగి ఉండే సైట్లను వాడరాదు. ఉదాహరణలు: tinyurl.com, makeashorterlink.com. ఇలాంటి సైట్లు m:Spam #FFFFFFlist జాబితాలో చేరి ఉన్నాయి. purl.org లాంటి శాశ్వత URL సైట్లు మాత్రం దీనికి మినహాయింపు. ఒక్కోసారి సూటి url కంటే ఇలాంటి PURL url నే అధికారికంగా సైటు స్వంతదారు కూడా భావించవచ్చు. అలాంటపుడు లింకు purl కే ఇవ్వాలి. లింకును నేరుగా లక్ష్యం పేజీకే ఇవ్వాలి. ఉదాహరణకు example.com అనే లింకు tripod.com/example కు దారిమార్పు చెందుతుంటే, మొదటిదే అధికారికమైనప్పటికీ లింకు రెండోదానికే ఇవ్వాలి. [మార్చు] మీడియామీరు లింకిచ్చే పేజీలో కేవలం మామూలు HTML లేదా కేవలం టెక్స్టు ఉండేలా చూడండి. లింకు ఇస్తున్న పేజీ కంటెంటు టైపు "text/html" గానీ, "text/plain" గానీ, లేదా "application/xhtml+xml" గానీ ఉండాలి. పేజీలోని కంటెంటును చూడాలంటే ప్రత్యేక సాఫ్టువేరు లేదా బ్రౌజరు అదనాలు అవసరమయ్యే పేజీలకు నేరుగా లింకు ఇవ్వవద్దు. అలాంటి మీడియా ఉన్న పేజీలకు లింకులు ఇవ్వక తప్పనపుడు ఆ విషయాన్ని లింకు పక్కనే రాస్తూ ఆ మీడియా ఫైళ్ళను పని చేయించాలంటే ఏయే సాఫ్టువేర్లు కావాలో కూడా రాయాలి. [మార్చు] YouTube, Google Video వంటి సైట్లకు లింకు ఇవ్వడంఈ సైట్లకు లింకు ఇవ్వడంపై నిషేధమేమీ లేదు. సదరు లింకులు ఈ పేజీలో సూచించిన మార్గదర్శకాలకు లోబడి ఉంటే చాలు. [మార్చు] ఏదైనా ఒక దృక్కోణానికి అవసరమైన దానికంటే ఎక్కువ విలువ ఇవ్వకండివివిధ దృక్కోణాలు కలిగి ఉన్న వ్యాసపు బయటి లింకుల్లో కూడా అన్ని దృక్కోణాలను ప్రతిబింబించే విధంగా లింకులను ఇవ్వండి. ఒక దృక్కోణానికి చెందిన లింకులు మిగతా వాటికంటే బాగా ఎక్కువగా ఉండరాదు. అల్పదృక్కోణాలకు అనవసరమైన ప్రాముఖ్యత ఇవ్వకండి. ఈ లింకుల పక్కనే అవి ఏ దృక్కోణాన్ని ప్రతిబింబిస్తాయో రాయండి. [మార్చు] లింకుల జీవితకాలంమీరిచ్చే లింకు భవిష్యత్తులో ఎన్నాళ్ళు చురుగ్గా ఉంటుందో, ఎన్నాళ్ళు వ్యాస విషయానికి దగ్గరగా ఉంటుందో కూడా చూడాలి. ఉదాహరణకు ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి ఏదైనా వార్తాపత్రికకు లింకు ఇచ్చారనుకోండి.. ఒక్కరోజులోనో, ఒక వారంలోనో ఆ లింకుకు కాలదోషం పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. [మార్చు] మురిగిపోయిన బయటి లింకునేం చెయ్యాలిచచ్చిపోయిన url లకిచ్చే లింకుల వలన వికీపీడియా వ్యాసాలకు ప్రయోజనమేం లేదు. అలాంటి మురిగిపోయిన లింకులను తీసెయ్యాలి, లేదా కొత్త url లకు మార్చాలి. దుశ్చర్యల కారణంగా కూడా మురిగిపోయిన లింకులు ఏర్పడవచ్చు. తమకిష్టం లేని వెబ్ సైట్లకిచ్చే లింకులను దుష్టులు తప్పుగా రాసి, కావాలని తప్పు url కు దారిచూపెట్టొచ్చు. ఇదొక ప్రత్యేక రకం దుశ్చర్య. [మార్చు] హైజాక్ అయిన సైట్లుఅప్పుడప్పుడు కొన్ని సైట్లు హైజాక్ అవుతూ ఉంటాయి. అలాంటి సైట్లకు ఇచ్చిన లింకులు సంబంధం లేని వేరే సైటుకు వెళ్తాయి. దీనికి ఒక కారణం.. ఆ సైటు డొమెయిను పేరుకు కాలదోషం పట్టడంతో, ఆ డొమెయినుకు వెళ్ళే లింకులను వేరే సైటుకు, ముఖ్యంగా బూతు సైట్లకు, దారిమారుస్తారు. హైజాకు అయిన సైట్లకు ఇచ్చిన లింకులను మురిగిపోయిన లింకుల లాగానే చూడాలి. [మార్చు] లింకు ఇవ్వడం ఎలాటెక్స్టేమీ లేకుండా లింకు (కోడు, నమూనా ఫలితం): [http://example.com/] [1] టెక్స్టుతో కూడిన లింకు: [http://example.com/ ఉదాహరణ.కామ్ వెబ్సైటు] ఉదాహరణ.కామ్ వెబ్సైటు ఖాళీ (స్పేసు) తరువాత వచ్చే టెక్స్టు నంతా లింకు టెక్స్టుగా చూపిస్తుంది. లింకు టెక్స్టులో వికీ లింకులను చేర్చరాదు. వాటిని ఆ టెక్స్టు బయట ఉంచాలి. "[http://example.com/ ఉదాహరణ.కామ్] [[వెబ్సైటు]]". "ఉదాహరణ.కామ్ వెబ్సైటు". [మార్చు] బయటి లింకుల విభాగంబయటి లింకుల కోసం రెండు పద్ధతులున్నాయి. మొదటిది బయటి లింకులన్నిటినీ వ్యాసం చివర ఒక జాబితాగా రాయడం. ఈ జాబితాను "బయటి లింకులు" అనే 2వ స్థాయి శీర్షికగా కింద (అంటే == శీర్షిక ==) పెట్టి బులెట్ల జాబితాగా ఏర్పాటు చెయ్యాలి. ఉన్న లింకు ఊకటే అయినా "బయటి లింకులు" అని బహువచనమే ఉండాలి. వేరే వెబ్ సైటుకు లింకు ఇచ్చేటపుడు ఆ సైటుకు సంబంధించి చిన్న సారాంశాన్ని కూడా రాయండి. అది ఈ వ్యాసానికి ఏ విధంగా సంబంధిస్తుందో కూడా రాయండి. వేరే ఆన్లైను వ్యాసాన్ని ఉదహరిస్తుంటే దాని గురించి కూడా క్లుప్తంగా రాయండి. == బయటి లింకులు == * [http://example.com/link_1 లింకు 1] * [http://example.com/link_2 లింకు 2] [మార్చు] మూలాలు, వనరులువ్యాసాన్ని రాయడంలో ఉపయోగపడిన సైట్లను "మూలాలు" లేదా "వనరులు" అనే విభాగంలో చేర్చాలి. వాటిని బయటి లింకులు విభాగంలో చేర్చరాదు. [మార్చు] బయటి లింకుల కోసం వెతకడంవికీపీడియా నుండి బయటికి వెళ్ళే లింకుల కోసం వెతికేందుకు Special:Linksearch ఒక పరికరం. ఉదాహరణకు, ఈ లింకు యాహూ.కామ్ కు వెళ్ళే అన్ని లింకులను చూపిస్తుంది. [మార్చు] ఇవి కూడా చూడండి |