పరికరాల పెట్టెఇతర భాషలు
|
భారత దేశము
భారత గణతంత్ర రాజ్యము నూటపది కోట్లకు పైగా జనాభా తో ప్రపంచం లో అత్యధిక జనాభా కలిగిన దేశాలలో రెండవది. వైశాల్యము లో ప్రపంచం లో ఏడవది. భారత దేశ ప్రాముఖ్యత గత రెండు దశాబ్దాలలో గణనీయంగా పెరిగింది. భారత ఆర్ధిక వ్యవస్థ యొక్క స్థూల జాతీయోత్పత్తి( పర్చేసింగ్ పవర్ పారిటీ) ప్రకారం నాలుగో స్థానంలో ఉంది. ప్రపంచంలో అతివేగంగా వృద్ధి చెందుతున్న వ్యవస్థలలో ఇది ఒకటి. ప్రపంచం లోనే అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యము ఐన భారతదేశం, ప్రపంచం లోనే అతి పెద్ద సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగన దేశంగా ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఆవిర్భవించినది. దక్షణాసియా లో ఏడు వేల కిలోమీటర్లకు పైగా సముద్రతీరము కలిగి ఉండి, భారత ఉపఖండము లో అధిక భాగాన్ని కూడుకొని ఉన్న భారతదేశం, అనేక చారిత్రక వాణిజ్య రహదారుల పైన ఉన్నది. పాకిస్తాన్, చైనా, మయన్మార్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ మరియు ఆఫ్ఘానిస్తాన్[1] దేశాలతో సరిహద్దులను పంచుకుంటోంది. శ్రీలంక, మాల్దీవులు మరియు ఇండోనేసియా భారతదేశం దగ్గరలో గల ద్వీప-దేశాలు. భారతదేశము కొన్ని పురాతన నాగరికతలకు పుట్టిల్లు మరియు నాలుగు ముఖ్య ప్రపంచ మతాలకు (హిందూ మతము, బౌద్ధ మతము, జైన మతము మరియు సిక్కు మతము) జన్మనిచ్చినది. 1947 లో స్వాతంత్ర్యం రావడానికి ముందు బ్రిటీషు సామ్రాజ్యం లో భాగంగా ఉండేది. [మార్చు] పేరు పుట్టుపూర్వోత్తరాలుముఖ్య వ్యాసము: భారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలు భారత దేశానికి మొత్తం నాలుగు పేర్లు ఉన్నట్లు చెప్పుకోవచ్చు. వీటిలో మొదటిది జంబూ ద్వీపం. ఇది వేదాలలో భారతదేశానికి ఇవ్వబడిన పేరు, ఇప్పటికీ హిందూ మత ప్రార్థనలలో ఈ పేరు ఉపయోగిస్తారు (ఉదా: జంబూ ద్వీపే, మేరో దక్షిణభాగే, శ్రీశైల ఉత్తర భాగే, కృష్ణా గోదావారీ మధ్య స్థానే......). జంబూ అంటే "నేరేడు" పండు లేదా "గిన్నె కాయ", ఈ దేశంలో ఎక్కువగా నేరేడు పండ్లు ఉంటాయి కనుక దీనికి ఈ పేరు వచ్చినది.
తరువాతి పేరు హిందూదేశం, ఇది సింధునది పేరు మీదగా వచ్చినది, పూర్వపు పర్షియనులు, గ్రీకులు సింధునదికి ఆవల ఉన్న దేశం కనుక ఈ పేరుతో పిలిచారు. తరువాత హిందూదేశం యొక్క రూపాంతరం ఐన ఇండియా అనే పేరు, బ్రిటీషు వారి వలన ప్రముఖ ప్రాముఖ్యతను పొందినది, ప్రస్తుతము భారత దేశానికి రెండు ప్రభుత్వ గుర్తింపు పొందిన పేర్లు కలవు, అవి ఇండియా, భారత దేశం. ఇంకా హిందూస్తాన్ అనునది కూడా హిందూ దేశం యొక్క రూపాంతరమే! [మార్చు] చరిత్రముఖ్య వ్యాసము: భారతదేశ చరిత్ర మధ్య ప్రదేశ్ లోని భింబెట్కా వద్ద లభ్యమైన రాతియుగపు శిలాగృహాలు, కుడ్యచిత్రాలు భారతదేశంలో మానవుని అతి ప్రాచీన ఉనికికి ఆధారాలు. మొట్టమొదటి శాశ్వత నివాసాలు 9,000 సంవత్సారాల కిందట ఏర్పడ్డాయి. ఇదే క్రీ.పూ.26 వ శతాబ్దం మరియు క్రీ.పూ.20 వ శతాబ్దం మధ్య కాలంలో వర్ధిల్లిన సింధులోయ నాగరికత. క్రీ.పూ.5 వ శతాబ్దం నుండి, ఎన్నో స్వతంత్ర రాజ్యాలు ఏర్పడ్డాయి. ఉత్తర భారతంలో, మౌర్య సామ్రాజ్యం, భారతీయ సాంస్కృతిక వారసత్వానికి విలువైన సేవ చేసింది. అశోకుడు ఈ వంశంలోని ప్రముఖ రాజు. తరువాతి వచ్చిన గుప్తులకాలం స్వర్ణ యుగం గా వర్ణించబడింది. దక్షిణాన, వివిధ కాలాల్లో చాళుక్యులు, చేర, చోళులు, పల్లవులు, పాండ్యులు మొదలగువారు పాలించారు. విజ్ఞాన శాస్త్రము, కళలు, సారస్వతం, భారతీయ గణితం, భారతీయ ఖగోళ శాస్త్రం, సాంకేతిక శాస్త్రం, భారతీయ మతములు, భారతీయ తత్వ శాస్త్రం మొదలైనవి ఈ కాలంలో పరిఢవిల్లాయి. రెండవ సహస్రాబ్దిలో తురుష్కుల దండయాత్రలతో, భారతదేశంలో ఎక్కువ భాగాన్ని ఢిల్లీ సుల్తానులు, తరువాత మొగలులు పాలించారు. అయినా, ముఖ్యంగా దక్షిణాన స్థానిక సామ్రాజ్యాలు అధికారాన్ని నిలబెట్టుకున్నాయి.
ఇంకా చూడండి: [మార్చు] ప్రభుత్వము మరియు రాజకీయాలు
భారత దేశం ఒక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యము. ఇది పలు రాష్ట్రాల సమాఖ్య. దేశాధినేత అయిన రాష్ట్రపతి పదవి అలంకార ప్రాయమైనది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతులు పరోక్ష పద్ధతిలో ఎలక్టోరల్ కాలేజి ద్వారా ఐదేళ్ళ కాలపరిమితికి ఎన్నుకోబడతారు.
భారతదేశ పటం: నల్లటి గీత భార్త దేశం గుర్తించిన సరిహద్దు. కాశ్మీరు ఉత్తర ప్రాంతం భారత్, పాకిస్తాన్, చైనా ల అధీనంలో (పటంలో రంగుల్లో చూపబడినట్లుగా) ఉంది. ఈ ప్రాంతాలను వేరుచేస్తున్న గీత సంధి రేఖ మాత్రమే; ఇది అంతర్జాతీయ సరిహద్దు రేఖ కాదు. ఇక్కడి భారత, పాకిస్తాన్ ప్రాంతాల మధ్య రేఖను నియంత్రణ రేఖ (లైన్ ఆఫ్ కంట్రోల్) అనీ, భారత, చైనా ప్రాంతాలను వేరు చేసే రేఖను 'వాస్తవాధీన రేఖ' (లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్) అనీ అంటారు. అరుణాచల్ ప్రదేశ్ లోని చాల ప్రాంతం భారత అధీనంలో ఉన్నప్పటికీ అవి తనవే అని చైనా వాదన
[మార్చు] భౌగోళిక స్వరూపము, వాతావరణం
హిమాలయాలు ఉత్తరాన జమ్మూ కాశ్మీరు నుండి తూర్పున అరుణాచల్ ప్రదేశ్ వరకు విస్తరించి భారత దేశపు ఉత్తర సరిహద్దుగా విలసిల్లుతున్నాయి.
భారతదేశపు ఉత్తర, ఈశాన్య రాష్ట్రాలు హిమాలయ పర్వతాలతో కూడుకుని ఉన్నాయి. మిగిలిన ఉత్తర భారతం, మధ్య, ఈశాన్య ప్రాంతాలు సారవంతమైన గంగా మైదానంతో కూడి ఉన్నాయి. పశ్చిమాన, పాకిస్థాన్కు ఆగ్నేయ సరిహద్దున థార్ ఎడారి ఉన్నది. దక్షిణ భారత ద్వీపకల్పం దాదాపు పూర్తిగా దక్కను పీఠభూమితో కూడుకుని ఉంది. ఈ పీఠభూమికి రెండువైపులా తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు ఉన్నాయి.
[మార్చు] రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు
భారతదేశము 28 రాష్ట్రాలుగా విభజించబడినది. (రాష్త్రములు కొన్నిజిల్లాలుగా విభజించబడినవి), ఆరు కేంద్రపాలిత ప్రాంతములు మరియు జాతీయ రాజధాని ప్రాంతము,ఢిల్లీ. రాష్ట్రాలకు స్వంత ఎన్నికైన ప్రభుత్వము ఉండును, కానీ కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్ర ప్రభుత్వముచే నియమించబడిన ప్రతినిధిచే పరిపాలించ బడతాయి. రాష్ట్రములు: కేంద్రపాలిత ప్రాంతములు:
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||